Thursday, April 17, 2025

రుద్రం ...నమకం... చమకం

రుద్రం ...నమకం... చమకం
...................
నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః
నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యా ము తతేనమః..

నమో భవాయ చ రుద్రాయ చ.
నమశ్శర్వాయ చ పశుపతయే చ.

 పరమేశ్వరుడి ని సేవించుకుని ఆయనకి అర్చన చేయడం లో  హెచ్చు స్వరం లో పఠించే శ్రీ రుద్రం   ....నమకం, చమకం అని రెండు భాగాలుగా ఉంటుంది. యజుర్వేదం 16వ అధ్యాయాన్ని నమకం అంటారు. మంత్రం చివర  నమః అనేపదం ఉంటుంది కాబట్టి   నమకం అని అన్నారు.  యజుర్వేదం 18వ అధ్యాయాన్ని చమకం అంటారు. ఇక్కడ మంత్రం చివర "చ" అనే పదం ఉంటుంది కాబట్టి చమకం అని అన్నారు..
రుద్రం, మహారుద్రం, లఘురుద్రం, అతి రుద్రంలో తేడాలు ఉన్నాయి. యజుర్వేదంలోని మంత్రభాగమైన 11 అనువాకాల 'శతరుద్రీయా'నికి 'రుద్రం' అని పేరు. ఒకసారి పఠిస్తూ చేసే అభిషేకం రద్రాభిషేకం అంటారు. దానికి 'రుద్రం', 'ఏకరుద్రం' అని పేర్లు కూడా ఉన్నాయి. ఈ 11 అనువాకాల 'రుద్రం' పదకొండుసార్లు చెబుతూ చేస్తే 'ఏకాదశ రుద్రాభిషేకం' లేదా 'రుద్రి' అంటారు. రుద్రాన్ని 121 సార్లు పఠిస్తూ చేసే అభిషేకం 'లఘురుద్రాభిషేకం'. 11 లఘురుద్రాలు ఒక 'మహారుద్రం' అంటే, ఈ అభిషేకంలో రుద్రం (మొత్తం 116 అనువాకాలు) 1331 సార్లు పఠించబడుతుంది. ఈ మహారుద్రాలు పదకొండయితే 'అతిరుద్రం', దీనిలో 14641 సార్లు  రుద్రం చెప్పబడుతుంది. ఈ రుద్రమంత్రాలను అభిషేకానికి వాడితే 'రుద్రాభిషేకం' హోమంలో వినియోగిస్తే 'రుద్రయాగం'.

From FB - Vydehi Murthy