The range and extent of rituals, prayers, customs & traditions in the world are huge and vast. As a Hindu, I share views with millions, as Telugu, sentiments of a few less millions, as Brahmin, beliefs with a few hundred thousand. As Niyogi from Krishna Dist, of Andhra Pradesh, I am connected to core with a few thousands only. Here I am attempting to consolidate everything I know of religion, faith, custom and tradition. This is only sharing. Not to say that others are wrong.
Friday, June 27, 2025
Mahabharatam - Parasuram : మహాభారతం- నరశురాముడు
Thursday, May 15, 2025
మయుడు
Saturday, May 3, 2025
మహాభారతం - ఆదిపర్వం - కనిక నీతి
మహాభారతంలో ధృతరాష్ట్రుడు, పాండురాజు అన్నదమ్ములు. ధృతరాష్ట్రుని నూరుగురు కుమారులు, కౌరవులు, పాండురాజు ఐదుగురు కుమారులు పాండవులు ముఖ్యపాత్రధారులు. కౌరవులకి, పాండవులకి చిన్నతనం నుండే వైరం ఉండేది. పాండవులు ధర్మానికి కట్టుబడి, పెద్దల మాటలకి గౌరవం ఇచ్చి తమ పరిధి దాటకుండా నడుచుకునేవారు. కౌరవులు పాండవులని ఇబ్బంది పెడుతూ ఉండేవారు. కౌరవులలో పెద్దవాడు దుర్యోధనుడు దుర్మార్గపు ఆలోచనలతో ఉండేవాడు.
యుక్తవయస్కులైన రాకుమారుల అస్త్రవిద్యా ప్రదర్శన తరువాత ధృతరాష్టుడు పెద్దవాడైన ధర్మరాజుకు యువరాజు పట్టాభిషేకం చేసాడు. తనకన్నా పెద్దవాడు, అన్నవరసైనవాడు అయిన ధర్మరాజుకు న్యాయంగా ధర్మంగా దుర్యోధనుడు కట్టుబడి ఉండాలి. తమ్ముడిగా సేవించాలి. అప్పటివరకూ పాండవులలో తన బల పరాక్రమాలలో సరిజోడైన భీముని చంపెయ్యాలన్న ఆలోచనతో ఎప్పుడూ వుండే దుర్యోధనుడు ఇప్పుడు ధర్మరాజు యువరాజు స్థానంలో వుండటం ససేమిరా నచ్చక, తాను రాజు అవ్వాలన్న కోరిక బలీయంగా ఉండటంతో, ధర్మ రాజుని ఒక శత్రువుగా భావిస్తూ ఆయనని చంపాలని ఆలోచనతో, తన భవనంలో ఒక సమావేశం ఏర్పాటు చేసాడు. ఆ సమా వేశానికి తన మద్దతుదారులు, ఆప్తులూ అయిన తమ్ముడు సుశ్శాసనుని, మిత్రుడు కర్ణుని, మేనమామ గాంధార దేశ రాజు శకునిని పిలిచాడు.
యువరాజు పదవిలో శాస్త్రోక్తంగా పెద్దల ఆశీర్వాదంతో వున్న ధర్మరాజుని చంపటం అధర్మం. అందుకని దుర్యోధనుడు రాజనీతిలో శత్రువుని తుదముట్టించే ఆలోచన చస్తూ సమావేశానికి వచ్చిన వారి అభిప్రాయాలు అడిగాడు.
నన్నయ్య గారు రాసిన ఆంధ్ర మహాభారతంలో కనికుడు, శకునికి మంత్రి, దుర్యోధనుని ప్రశ్నకి సమాధానం చెప్పాడు. వేద వ్యాసుడు వ్రాసిన సంస్కృత మహాభారతంలో ధృతరాష్టుడు ఈ విషయం మాట్లాడినట్టుగా ఉంటుంది
దుర్యోధనుని ప్రశ్న – రాజనీతి ద్రుష్టిలో శత్రువు మీద దాడి వ్యూహంలో రాజులకి ఏది న్యాయం?
సమావేశంకి శకునితో పాటు వచ్చిన గాంధారదేశ మంత్రి కనికుడు ఇలా సమాధానం చెప్పాడు.
- రాజు ఏదన్నాచెయ్యాలని అనుకున్నప్పుడు వెంటనే చేయకూడదు. అనుభవజ్ఞుల దగ్గర అది పెద్దవారవ్వచ్చు లేదా మంత్రులు అవ్వచ్చు లేక సలహాదారులు అవ్వచ్చు, వారితో సంప్రదించి, చర్చించి, విశ్లేషించి, మంచి చెడ్డలు ఆలోచించి, నిర్విఘ్నంగా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా చేయాలి.
- ప్రజలు ఒక శాసనం నిబద్ధతతో పాటిస్తున్నారు అంటే, ఆ దేశ రాజుగారు దండనీతిని చక్కగా అమలుపరుస్తున్నాడని అర్ధం.
- దండనీతి అంటే ఎప్పుడు, ఎవరికి, ఎలాంటి పనికి, ఎటువంటి దండన విధించటం అనెడిది స్పష్టంగా తర్కానికి తావు లేకుండా విధించటం. రాజు ఇది పాటించినప్పుడు ఏ వర్ణం వాళ్ళు చేయాల్సిన పనిని ఆ వర్ణం వాళ్ళు సరిగ్గా చేస్తారు. అందరూ కూడా సమ బుద్ధితోటి రాజుని అనుకరిస్తారు.
- రాజు తన బలహీనతలను ఎవరితోటి చెప్పకూడదు. కానీ, అవతలివారి బలహీనతలని తప్పకుండా తెలుసుకుంటూ ఉండాలి.
- శత్రువు రోజురోజుకీ బలవంతుడు అవుతున్నాడు, బలం పుంజుకుంటున్నాడు, వృద్ధిలోకి వస్తున్నాడు అంటే, వెంటనే ముందు ఆ శతృవుని తుదముట్టించాలి. ఇది రాజనీతి.
- మొక్కై వంగనిది మానై వంగుతుందా అని, మొదట్లో ఉన్నప్పుడే శత్రువు అని గమనించగానే ఆ శత్రువు నుంచి ఆపద పొంచి ఉంది అని ఊహకి తెలియగానే ఆ శత్రువుని చంపేసేయాలి.
- చిన్నవాడైనా, తనకన్నా బలహీనుడైనా శత్రువు అన్న వారిని రాజు వదలకూడదు.
- శత్రు శేషం ఉండకూడదు అని ఆలోచన చేసే రాజు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
- విహారానికి కానీ, కొండమీదికి కానీ, ఉద్యానవనానికి కానీ, సభలకి కానీ, పుణ్యక్షేత్రాలకీ తీర్థాలకి కానీ, వెళ్ళాలని అనుకొంటే, రాజు గారి ముందు ఆయన రక్షణ యంత్రాంగం కదిలి, రక్షక భటులు వెళ్ళి ఆ చోటుని బాగా పరిశీలించి, వెతికి ఆయనకు ఎటువంటి భయం లేదని తీర్మానించిన తరువాతనే రాజుగారు ఆ చోటికి వెళ్ళాలి.
- రాజు కోపానికి వచ్చే ఫలితం ఎదుటి వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాకూడదు తెలియకూడదు.
- అలాగే ప్రేమకి ఫలితం కూడా తెలియకూడదు.
- రాజు ఎప్పుడు ఎవరి మీద కోపంగా ఉన్నాడో, ఎవరి మీద ప్రేమగా ఉన్నాడో, వారికి ఎటువంటి దండన విధిస్తారో లేకపోతే ఎటువంటి అభిమానం చూపెడతాడో తెలియకూడదు.
- శత్రువు తోటి కలిసి తిరిగేటప్పుడు అతని మీద రాజుకి కక్ష ఉందని కానీ, కోపం ఉందని కానీ తెలియకూడదు.
- శత్రువు పక్కనే ఉన్నప్పుడు ఏమరుపాటుగా ఉండడం తగదు. అప్పుడు ఆ రాజు పరిస్థితి చెట్టు చిటారు కొమ్ము మీద ఆదమరిచి నిద్రపోతున్న వాడి పరిస్థితి.
Thursday, April 24, 2025
మహాభారతం - కృపాచార్యుడు
పురిటి కథ
పెరట్లో పారేసిన ఆ నలుగు పిండి, పసుపు కుప్పల మీద రెండు చెట్లు మొలిచాయి. ఆ అమ్మాయి స్నానం జేసిన నీరు ఓ కాలువగా ప్రవహించసాగింది.
పిల్ల ఎదుగుతూ వుంది. తండ్రికి ఇది కొంత వింతగాను ఒక రకంగా గొప్పగానూ తోచ సాగింది. ఎవరైతే ఈ చెట్ల పేరు, కాలువ పేరు చెప్పుకొంటారో వారికి నా పిల్లనిచ్చి పెళ్లి చేస్తానని ఆ తండ్రి ప్రతిజ్ఞ చేసాడు.
ఎంతెంత పండితులు వచ్చీ, ఎంతెంత విద్వాంసులు వచ్చి వాటి పేర్లు చెప్పలేక పరాభూతులై వెళ్లిపోతున్నారు. పిల్లకు పెళ్లీడు దాటి పోతుంది.
పెరట్లో పాలేరు పాపం ఈ పిల్ల కట్టు తప్పి పోతూంది.
వీటి పేరు నేను చెప్తే నాకీ పిల్లనిచ్చి పెళ్లిచేస్తాడేమో చూద్దాం అనుకున్నాడు.
పెరట్లో గోడ చాటున కూర్చొని బ్రాహ్మణుడు శిష్యులకు చెబుతూ వుంటే విని రెండు వేద పనసలు నేర్చుకొన్నాడు. ఒకనాడు శుభ్రంగా క్షవరం చేయించుకొని స్నానం చేసి విభూది పిండికట్లు పెట్టుకొని, దర్భాసనం జారీ చెంబు పట్టుకొని వేద పనసలు చదువుతూ విప్రుని ఇంటికి వచ్చాడు అతడు.
‘‘ఓహోహో! అవధాన్లుగారు వచ్చారు" అని ఇంటివారు అతడికి కాళ్లకు నీరిచ్చి మర్యాద చేసారు.
వచ్చినవాడు పెరట్లోకి కాళ్లు కడుగుకోవడానికి వెళ్లి, "ఓహోహో! సోమయాజులు గారు పసుపు చెట్టూ, నలుగు చెట్లూ వేయించి పసుపు కాలువ తవ్వించారే’’ అన్నాడు.
"వీటి పెరు చెప్పుకొన్నావు. నీకే నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాను" అన్నాడు ఇంటాయన.
ఇల్లూ లేదు, వాకిలి లేదు. తల్లీ లేదు, తండ్రీ లేడు. నాకు పెళ్లేమిటి అన్నాడు అతిథి.
ఈ నాటి నుంచి మా ఇల్లే నీ ఇల్లు, మేమే నీ తల్లిదండ్రులం కాదనడానికి వీలు లేదు. అని తన కూతుర్నిచ్చి పెళ్లి చేసాడు బ్రాహ్మణుడు. కూతురూ, అల్లుడూ ఇంట్లోనే వుంటున్నారు.
ఇద్దరు ఆడపిల్లలు కలిగారు. సాటి వారు అత్తవారింటికి వెళ్ళడం చూచి, తండ్రి వద్దకు వెళ్లి "నాన్న నాకు అత్తవారింటికి వెళ్లాలని మనసుగా వుంది" అంది ఆ అమ్మాయి.
తండ్రి అల్లుణ్ణి పిలిచి "ఏమోయ్ మా అమ్మాయికి అత్త వారింటికి వెళ్ళాలని మనసుగా వుందట తీసుకొని వెళ్ళవలసింది" అని అల్లుడికి కొంత డబ్బు ఇచ్చాడు.
అతడు ఆ డబ్బుతో ఊరికి దూరంగాను, .......పల్లెకు చేరువగానూ ఓ ఇల్లు వేసి భార్య, పిల్లలతో అందులో కాపురం పెట్టాడు.
రోజులు గడుస్తున్నాయి.
ఒక రోజు భర్త అరుగు మీద కూర్చొని వుండగా ఒకడు ఆ దారిన పోతూ "ఓరి బావా... ఓరి ఎళ్లా యిలారా" అని పిలిచాడు.
ఇంట్లో పనిచేసుకుంటున్న బ్రాహ్మణి ఇది విని "అదేమిటండీ? వాడు మిమ్మల్ని ఇలా పిలుస్తున్నాడు" అని అడిగింది.
"ఏం లేదు. ఏదో పూర్వ స్నేహంలే" అన్నాడు భర్త.
ఇదేమిటో చూద్దాం అని అతడి వెనుకనే బయలుదేరింది. ఆమె భర్త వానితో అతడి గూడేనికి వెళ్లి, వాళ్ల కంచాల్లో తిని, వాళ్ల ముంతల్లో త్రాగి వాళ్ల మంచాలపై దొర్లి, వాళ్ల గ్రామ్య భాషలో మాట్లాడటం చూసింది ఆమె. జరిగిన మోసం అర్థం అయిపోయింది.
గబ గబా తండ్రి వద్దకు వెళ్లి "నాన్న కుక్క ముట్టుకున్న కుండకు ప్రాయశ్చితం ఏమిటి ?" అని అడిగింది.
జరిగినదేమీ తెలియని అతడు వంటపాత్ర ఏదో కుక్క తాకి అపవిత్రం అయ్యిందని తలచి, "ప్రాయశ్చితం ఏముందమ్మా అగ్ని ప్రాయశ్చిత్తమే ప్రాయశ్చితం" అన్నాడు.
బ్రాహ్మణి తిన్నగా ఇంటికి వెళ్లింది. ఏమి మాట్లాడకుండా వంట చేసి భర్తకూ, పిల్లలకూ పెట్టి తాను మాత్రం అభోజనంగా పడుకుంది.
ఓ రాత్రి వేళ లేచి నిప్పు ముట్టించి తిరిగి పడుకొంది. తెల్లవారేసరికి నలుగురూ ఆ యింటితో పాటు కాలి మసయి వున్నారు.
నాలుగు జీవాలు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లాయి.
బ్రహ్మదేవుడు మీకేం ముక్తి? నీ భర్త పోతురాజు గ్రామ దేవత గుడి ముందు రాయిగా వుండి గ్రామదేవతతో పాటు పూజలందుకుంటాడు.
నీ బిడ్డలిద్దరూ కొత్తెమ్మ, కొర్రెమ్మ పురిటి నీళ్ల నాడు పెట్టే షడ్రసోపేతమైన నైవేద్యం వీళ్లకు ఆహారం.
నువ్వు ఎన్నెమ్మ పురుగై తిరుగుతూ నిన్ను ఎవరైతే తలవరో వారి పురిటి శిశువుల్ని తింటూవుండు అదే నీకు ఆహారం అన్నాడు ఎన్నెమ్మతో.
పాలేరు చేసింది వంచనే అయినా కల్లా కపటం లేదు. వాడు చేసిన పనిలోని ప్రమాదం అతడికి తెలియదు. పిల్లలు ఏ పాపం ఎరుగని అమాయకులు ఎటొచ్చీ బ్రాహ్మణి తండ్రి అహంకారం, భర్త వంచనకు ప్రతీకారం చేయబోయి ఆమె శాశ్వతంగా పురుగుగా రూపొందింది.
ఏలా కోటెమ్మ
మా బాలల్ని గాయీ
ఒకటోనాడు ఎన్నెమ్మ
ఓరుస్తుందే ఎన్నెమ్మ
రెండో నాడూ ఎన్నెమ్మ
రెక్కలు కట్టుకు ఎన్నెమ్మ
మూడోనాడు ఎన్నెమ్మ
మువ్వలు కట్టుకు ఎన్నెమ్మ
నాలుగో నాడూ ఎన్నెమ్మ
నాట్యంచేసీ ఎన్నెమ్మ
ఐదో నాడూ ఎన్నెమ్మ
ఆడుతు పాడుతు ఎన్నెమ్మ
ఆరో నాడూ ఎన్నెమ్మ
అరుస్తూను ఎన్నెమ్మ
ఏడో నాడూ ఎన్నెమ్మ
ఏడుస్తూనూ ఎన్నెమ్మ
ఎనిమిదో నాడు ఎన్నెమ్మ
ఏరుదాటే ఎన్నెమ్మ
తొమ్మిదో నాడూ ఎన్నెమ్మ
తోరణందూరే ఎన్నెమ్మ
పదవనాడూ ఎన్నెమ్మ
పట్నందాటే ఎన్నెమ్మ
అని పాడుతూ మల మూత్ర విసర్జన వేళ ఇన్ఫెక్షన్ సోకే అవకాశం వుందని 3,4,5,6 రోజులు మాతా, శిశువుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడాలని, ఏడవ రోజున ఎన్నెమ్మ తన ప్రయత్నాలు సాగలేదని ఏడుస్తూ వుంటుందనీ, ఏడు రోజులు దాటితే కొంత ఆపద తొలుగుతుందని, పదో రోజున ఎన్నెమ్మ పట్నం దాటి అంతా శుభమని ఈ పాటలో అన్యాపదేశంగా చెప్తారు.
అమ్మా ధన్యాస్మి ....దీని తరువాత అనుకుంటా పురుటి మంచం కోళ్ళకు
కూడా పసుపు,కుంకుమ రాసి పూజ చేసి నైవేద్యం ఇస్తారు, తరువాత సూర్యుడికి అర్ఘ్యమూ ,నైవేద్యమూ (పెరుగన్నం ) పెడతారు ....
మేం ఇప్పుడు కూడా ఈ కథ చెబుతూనే పురిటి స్నానం పోస్తాం తరువాత చాకలమ్మాయి బట్టలన్ని పట్టుకుని వెనక్కుతిరిగి చూడకుండా వెళ్ళి పోతుంది సాయంత్రం చాకలమ్మాయి మళ్ళీ వస్తుంది అప్పుడు తల్లి పిల్లను నల్లటి రగ్గుతో కప్పి, నాలుగు దిక్కుల్లో నాలుగురకాల అన్నంలో దీపాలు పెడతారు పసుపు కుంకుమ పెరుగు. తెలుపురంగులు తరువాత గలకరాళ్ళు డబ్బాలో పోసి చేతితో తడుతూ తానుగెంతుతూ ఈ పాట పాడి దిష్టి తీసి వెళ్ళి పోయాక అక్కడంతా శుభ్రం చేసి పురిటి మంచం కోళ్ళకు పూజ చేస్తారు అత్తవారింటికి వెళ్ళాక కూడా మళ్ళీ వచ్చి ఒక రోజు పురిటి మంచం చూసి పడుకుని వెళ్ళాలంటారు.
నా పురిటి అప్పుడు మా మామ్మ చెప్పింది ఈ కథ! అప్పుడు చాలా భయం వేసింది కూడా! పురిటి పసికందుని ఒంటరిగా వదిలి వెళ్లవద్దని చెప్పింది. ఎప్పుడూ పురిటి గదిలో దీపం ఉంచాలని కూడా చెప్పింది. చీకట్లో పదుకోకూడదుట తల్లీ పసిపిల్లా! ఇప్పటివారికి ఇవి విడ్డూరాలు మరి!!
Saturday, April 19, 2025
నాతి చరామి
అది నిజానికి ' న అతి చరామి ' అంటే ' నిన్ను దాటి వెళ్ళను ' అని భర్త భార్య తో చెబుతాడు.. వివాహం చేసుకుంటున్నప్పుడు.
ధర్మేచ, ఆర్థేచ, కామేచ…న అతి చరామి అన్నది పూర్తి పాఠం.
"ధర్మం పాటించడంలోనూ, సంపాదించడంలోనూ, ధర్మసమ్మతమైన జీవితం గడపటంలోనూ నిన్ను దాటి వెళ్ళను "
అంటే.. నా ఒక్కడి కోసమే చేయను. నేను చేసే అన్ని ధర్మ బద్ధమైన కార్యాలూ నీ భాగ స్వామ్యం తోనే చేస్తాను. నీవు లేకుండా చేయను అని అర్థం.
భార్య లేనివాడు ఏ రకమైన కామ్య కారక యజ్ఞాలు చేయరాదు. భార్యకు అంత ప్రాముఖ్యత అని వేదం నిర్దేశం చేసింది.
బ్రాహ్మచారికి శంకుస్థాపన చేసే అధికారం కూడా లేదు.
షరా : అక్కడక్కడా ధర్మేచ అర్ధేచ, కామేచ, మోక్షేచ అన్నది కూడా వినపడుతుంది. కానీ ఇది తప్పు. ' మోక్షేచ అన్నది లేదు.
మోక్షం విషయం లో ఎవరి అర్హత వారిదే.
"అర్ధేచ, నీతో సంప్రదించి, ఆలోచన చేసి, తెలియ చేసిన తరువాతనే, డబ్బు, ఆస్తుల విషయాలలో నిర్ణయం తీసుకుంటాను"
"కామేచ, కామం అంటే ఒక్క శారీరక వాంఛ మాత్రమే కాదు. మనసులోన వచ్చే ఏ ప్రాపంచిక. కోరిక అయినా నీకు చప్పి, నీ సహచర్యంలో , నీతో, నీ ద్వారా మాత్రమే అనుభవిస్తాను."
బ్రాహ్మణుడు జీవితంలో రెండుసార్లు నాతి చరామి అంటాడు.
మెదటి సారి ఉపనయనం సమయంలో తండ్రికి మాట ఇస్తాడు.
"నేను మీరు ఉపదేశించిన గాయత్రి మంత్రం, ఈ ప్రక్రియ ద్వారా పొందిన విధివిధానం, భ్రహ్మచర్యం పాటిస్తూ. మీ ఆఙ్ఞానుసారం అవలంభిస్తాను." అని.
రెండవసారి పెళ్ళిలో సహధర్మచారిణికి వాగ్దానం చేస్తూ.
Thursday, April 17, 2025
రుద్రం ...నమకం... చమకం
...................
నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః
నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యా ము తతేనమః..
నమో భవాయ చ రుద్రాయ చ.
నమశ్శర్వాయ చ పశుపతయే చ.
పరమేశ్వరుడి ని సేవించుకుని ఆయనకి అర్చన చేయడం లో హెచ్చు స్వరం లో పఠించే శ్రీ రుద్రం ....నమకం, చమకం అని రెండు భాగాలుగా ఉంటుంది. యజుర్వేదం 16వ అధ్యాయాన్ని నమకం అంటారు. మంత్రం చివర నమః అనేపదం ఉంటుంది కాబట్టి నమకం అని అన్నారు. యజుర్వేదం 18వ అధ్యాయాన్ని చమకం అంటారు. ఇక్కడ మంత్రం చివర "చ" అనే పదం ఉంటుంది కాబట్టి చమకం అని అన్నారు..
రుద్రం, మహారుద్రం, లఘురుద్రం, అతి రుద్రంలో తేడాలు ఉన్నాయి. యజుర్వేదంలోని మంత్రభాగమైన 11 అనువాకాల 'శతరుద్రీయా'నికి 'రుద్రం' అని పేరు. ఒకసారి పఠిస్తూ చేసే అభిషేకం రద్రాభిషేకం అంటారు. దానికి 'రుద్రం', 'ఏకరుద్రం' అని పేర్లు కూడా ఉన్నాయి. ఈ 11 అనువాకాల 'రుద్రం' పదకొండుసార్లు చెబుతూ చేస్తే 'ఏకాదశ రుద్రాభిషేకం' లేదా 'రుద్రి' అంటారు. రుద్రాన్ని 121 సార్లు పఠిస్తూ చేసే అభిషేకం 'లఘురుద్రాభిషేకం'. 11 లఘురుద్రాలు ఒక 'మహారుద్రం' అంటే, ఈ అభిషేకంలో రుద్రం (మొత్తం 116 అనువాకాలు) 1331 సార్లు పఠించబడుతుంది. ఈ మహారుద్రాలు పదకొండయితే 'అతిరుద్రం', దీనిలో 14641 సార్లు రుద్రం చెప్పబడుతుంది. ఈ రుద్రమంత్రాలను అభిషేకానికి వాడితే 'రుద్రాభిషేకం' హోమంలో వినియోగిస్తే 'రుద్రయాగం'.
From FB - Vydehi Murthy
Vidurudu - Mahabharatam
Mahabharata is an epic.
The main event in this is the Kurukshetra War. War to establish Dharma. Those who directly or indirectly caused the war,
the great warriors who participated, and the characters are causal births.
While Krishna is the real Supreme Soul, some are immortals, some are divine
beings, and some are born only for that war. All of them were the steps that
Jaganmata moved and created to set foot in Kurukshetra at that time, and to
destroy the unrighteousness of Dwapara Yuga.
The events that were created by Jaganmata are beyond human imagination. Shantanu meeting Ganga, the curse of the eight Vasus, the birth of Matsyagandhi, the birth of Vedavyas through Parashara Maharshi and Matsyagandhi, the oath of Amba, the jealousy in the mind of Gandhari who was enjoying royal pleasures, the emergence of Draupadi . etc . . Thus, the many events and lives that have occurred in the cycle of time, and finally reaching Kurukshetra, are all the will of Jaganmata. Some events seem impossible, some events are surprising. All of this journey and goal is towards the establishment of Dharma. It is for the establishment of Dharma.
x x x x x x x x x x x x x x x x x x x x x x
Sunday, April 13, 2025
Black Hole
Saturday, April 5, 2025
Satyanaarayana Pooja - Mandapam
కృష్ణాష్టకం
కృష్ణాష్టకం
వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్ ।
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
అతసీ పుష్ప సంకాశం హార నూపుర శోభితమ్ ।
రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననమ్ ।
విలసత్ కుండలధరం కృష్ణం వందే జగద్గురమ్ ॥
మందార గంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజమ్ ।
బర్హి పింఛావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీల జీమూత సన్నిభమ్ ।
యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితమ్ ।
అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
గోపికానాం కుచద్వంద కుంకుమాంకిత వక్షసమ్ ।
శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితమ్ ।
శంఖచక్ర ధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
కృష్ణాష్టక మిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ ।
కోటిజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ॥



