Saturday, April 19, 2025

నాతి చరామి


అది నిజానికి ' న అతి చరామి ' అంటే ' నిన్ను దాటి వెళ్ళను ' అని భర్త భార్య తో చెబుతాడు.. వివాహం చేసుకుంటున్నప్పుడు.

ధర్మేచ, ఆర్థేచ, కామేచ…న అతి చరామి అన్నది పూర్తి పాఠం.

"ధర్మం పాటించడంలోనూ, సంపాదించడంలోనూ, ధర్మసమ్మతమైన జీవితం గడపటంలోనూ నిన్ను దాటి వెళ్ళను "

అంటే.. నా ఒక్కడి కోసమే చేయను. నేను చేసే అన్ని ధర్మ బద్ధమైన కార్యాలూ నీ భాగ స్వామ్యం తోనే చేస్తాను. నీవు లేకుండా చేయను అని అర్థం.

భార్య లేనివాడు ఏ రకమైన కామ్య కారక యజ్ఞాలు చేయరాదు. భార్యకు అంత ప్రాముఖ్యత అని వేదం నిర్దేశం చేసింది.

బ్రాహ్మచారికి శంకుస్థాపన చేసే అధికారం కూడా లేదు.

షరా : అక్కడక్కడా ధర్మేచ అర్ధేచ, కామేచ, మోక్షేచ అన్నది కూడా వినపడుతుంది. కానీ ఇది తప్పు. ' మోక్షేచ  అన్నది లేదు.

మోక్షం విషయం లో ఎవరి అర్హత వారిదే. 

"అర్ధేచ, నీతో సంప్రదించి, ఆలోచన చేసి, తెలియ చేసిన తరువాతనే, డబ్బు, ఆస్తుల  విషయాలలో నిర్ణయం తీసుకుంటాను"

"కామేచ, కామం అంటే ఒక్క శారీరక వాంఛ మాత్రమే కాదు. మనసులోన వచ్చే ఏ ప్రాపంచిక. కోరిక అయినా నీకు చప్పి, నీ సహచర్యంలో , నీతో, నీ ద్వారా మాత్రమే అనుభవిస్తాను."

బ్రాహ్మణుడు జీవితంలో రెండుసార్లు నాతి చరామి అంటాడు. 

మెదటి సారి ఉపనయనం సమయంలో తండ్రికి మాట ఇస్తాడు. 

"నేను మీరు ఉపదేశించిన గాయత్రి మంత్రం, ఈ ప్రక్రియ ద్వారా పొందిన విధివిధానం, భ్రహ్మచర్యం పాటిస్తూ. మీ ఆఙ్ఞానుసారం  అవలంభిస్తాను." అని.

రెండవసారి పెళ్ళిలో సహధర్మచారిణికి వాగ్దానం చేస్తూ.