Thursday, April 24, 2025

మహాభారతం - కృపాచార్యుడు

మహాభారతం ఒక ఇతిహాసం. 

ఇందులో ముఖ్య ఘట్టం కురుక్షేత్ర సంగ్రామం. ధర్మ యుద్ధం.   ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొన్న మహాయోధులు, పాత్రలు కారణ జన్ములు. కృష్ణుడు సాక్షాత్తు పరమాత్మ  అయితే, కొందరు అయోనిజలు, ఇంకొందరు దైవాంశసంభూతులు, మరికొందరు ఆ యుద్జధం కోసం మటుకే పుట్టిన వారు. వారందరూ ఆ సమయంలో కురుక్షేత్రంలోకి అడుగు పెట్టడానికి పుట్టిన వారే.  ద్వాఫర యుగ అధర్మ వినాశనానికీ జగన్మాత కదిపిన పావులు, సృష్టించిన  సంఘటనలు మనిషి ఊహకు అందనివి. శంతనుడు గంగను కలవటం, అష్ట వసువుల శాపం, మత్స్యగంధి జననం, పరాశర మహర్షి మత్స్యగంధి ద్వారా  వేదవ్యాసుని జననం, అంబ శపధం, రాజభోగాలు అనుభవించే గాంధారి మనసులో అసూయ, ద్రౌపది  ఆవిర్భావం . . .   ఇలా కాల చక్రంలో సంభవించిన అనేక సంఘటనలు,  జీవితాలు, చివరకు 
కురుక్షేత్రం చేరటం, అంతా జగన్మాత సంకల్పం. కొన్ని పుటుకలు  అసంభవంగా అనిపిస్తాయి, కొన్ని  సంఘటనలు ఆశ్చర్యంగా ఉంటాయి. అన్నిటి ప్రయాణం ధర్మ సంస్ధాపన వైపే.  ధర్మ సంస్ధాపన కోసమే. ధర్మ సంస్ధాపనే లక్ష్యం. 
= = = = = = = =  =  =  =  =  =  =  =  =  =  =  =  =  = 
గౌతమ మహర్షి కుమారుడు శరద్వందుడు. ఆయన పుట్టినప్పుడు  ఈయనతోపాటు బాణ సమూహం పుట్టాయి. 

శరద్వందుడు బ్రాహ్మణుడు అయినా వేదాధ్యాయనం చేయక, ధనుర్వేదం మీద విపరీతమైన ప్రీతితో అదే అభ్యసించాడు. ధనుర్వేదం వివిధ ఆయుధాల గురించి, వాటిని ప్రయోగించే తీరు గురించి, యుద్ధ కళల గురించి వివరిస్తుంది. 

శరద్వందుడు తాను నేర్చుకున్నదానితో తృప్తి చెందక, ఙ్ఞానోపార్జన కాంక్షతో తపస్సు చేయ మొదలు పెట్టాడు. ఆ సమయంలో జలపద అనే అప్సరస ఆ ప్రాంతానికి రావటం జరిగింది.   నిష్టగా, బ్రహ్మచర్యంతో,   ఘోర తపస్సులో ఉన్న శరద్వందుడు ఆమెను చూసాడు. ఆయన మనస్సు ఒక్క క్షణం చలించింది. మరుక్షణం ఆయన వీర్యం స్ధలించింది. 

మనుష్యు లోకంలో పురుషుడి వీర్యం  స్త్రీ గర్భంలో అండంగా రూపు దిద్దుకుంటుంది. కానీ, ఒక మహత్తర కార్యంలో ఒక పాత్ర పోషించడానికి ఒక మహానుభావుని సంతతి అవసరమైనప్పుడు స్త్రీ  సంభోగం లేకుండానే ఆయన సంతానోత్పత్తి ఒక వింత పద్ధతిలో  జరుగుతుంది. ఇది పరాశక్తి ఇఛ్ఛ. 

స్ధలించిన శరద్వందుని వీర్యం రెల్లు గడ్డి మీద పడి, రెండు భాగాలయ్యింది. శరద్వందుడు తన ధనుర్బాణాలు, జింక చర్మం ఆక్కడనే వదిలేసి, వెళ్ళిపోయాడు. భగవత్సంకల్పంతో ఆయన వీర్యం కాలక్రమేణ  ఒక మగ పిల్డవాడిగా, ఒక ఆడపిల్లగా రూపు దిద్దుకున్నాయి. ఆ సమయంలో వేటకు అటుగా వచ్చిన శంతన మహారాజు ఆ పిల్లల్ని, వారి పక్కన వున్న ధనుర్బాణాలు, జింక చర్మం చూసి, వారి పుటుక గొప్ప వంశంలో అని తలచి, వారికి కృప, కృపి అని పేర్లు పెట్టి తన అంతఃపురంలోనే పెంచి పెద్ద చేసాడు. కృప తన తండ్రి శరద్వందుని వద్ద ఆయుర్వేదం నేర్చుకున్నాడు. 

తరువాతి కాలంలో కృప పాండవులకు కౌరవులకూ మొదటి గురువై  ఆచార్య పదవి పట్టి, కృపాచార్యుడు అయ్యాడు.  కురుక్షేత్ర యుద్ధం లో కౌరవుల వైపు నిలిచి పోరాడాడు. కురుక్షేత్ర యుద్ధం పద్దెనిమిదవ రోజు రాత్రి  అశ్వత్థామ తో కలిసి పాండవ సేన గుడారాలకు నిపప్పు పెట్టి వారిని హతమార్చాడు. యుద్ధం తరువాత ధర్మరాజు కొలువులో మంత్రిగా ఉన్నాడు. పాండవులు స్వర్గారోహణకు వెళ్ళేటప్పుడు అర్జునుని మనవడు, అభిమన్యుని కొడుకైన పరీక్షిత్తుని కృపాచార్యుని సంరక్షణలో వదిలి వెళ్ళారు. 

కృపాచార్యుడు చిరంజీవి.  

పురిటి కథ

ఒక బ్రాహ్మణుడికి ఒక్కతే కూతురు. గారాబం చేత ఆ పిల్లకు రోజు ఒళ్లు నలచి తలంటు పోయించే వాడు ఆ అమ్మాయి తండ్రి.

పెరట్లో పారేసిన ఆ నలుగు పిండి, పసుపు కుప్పల మీద రెండు చెట్లు మొలిచాయి. ఆ అమ్మాయి స్నానం జేసిన నీరు ఓ కాలువగా ప్రవహించసాగింది.

పిల్ల ఎదుగుతూ వుంది. తండ్రికి ఇది కొంత వింతగాను ఒక రకంగా గొప్పగానూ తోచ సాగింది. ఎవరైతే ఈ చెట్ల పేరు, కాలువ పేరు చెప్పుకొంటారో వారికి నా పిల్లనిచ్చి పెళ్లి చేస్తానని ఆ తండ్రి ప్రతిజ్ఞ చేసాడు.

ఎంతెంత పండితులు వచ్చీ, ఎంతెంత విద్వాంసులు వచ్చి వాటి పేర్లు చెప్పలేక పరాభూతులై వెళ్లిపోతున్నారు. పిల్లకు పెళ్లీడు దాటి పోతుంది.

పెరట్లో పాలేరు పాపం ఈ పిల్ల కట్టు తప్పి పోతూంది.
వీటి పేరు నేను చెప్తే నాకీ పిల్లనిచ్చి పెళ్లిచేస్తాడేమో చూద్దాం అనుకున్నాడు.

పెరట్లో గోడ చాటున కూర్చొని బ్రాహ్మణుడు శిష్యులకు చెబుతూ వుంటే విని రెండు వేద పనసలు నేర్చుకొన్నాడు. ఒకనాడు శుభ్రంగా క్షవరం చేయించుకొని స్నానం చేసి విభూది పిండికట్లు పెట్టుకొని, దర్భాసనం జారీ చెంబు పట్టుకొని వేద పనసలు చదువుతూ విప్రుని ఇంటికి వచ్చాడు అతడు.

‘‘ఓహోహో! అవధాన్లుగారు వచ్చారు" అని ఇంటివారు అతడికి కాళ్లకు నీరిచ్చి మర్యాద చేసారు.

వచ్చినవాడు పెరట్లోకి కాళ్లు కడుగుకోవడానికి వెళ్లి, "ఓహోహో! సోమయాజులు గారు పసుపు చెట్టూ, నలుగు చెట్లూ వేయించి పసుపు కాలువ తవ్వించారే’’ అన్నాడు.

"వీటి పెరు చెప్పుకొన్నావు. నీకే నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాను" అన్నాడు ఇంటాయన.

ఇల్లూ లేదు, వాకిలి లేదు. తల్లీ లేదు, తండ్రీ లేడు. నాకు పెళ్లేమిటి అన్నాడు అతిథి.

ఈ నాటి నుంచి మా ఇల్లే నీ ఇల్లు, మేమే నీ తల్లిదండ్రులం కాదనడానికి వీలు లేదు. అని తన కూతుర్నిచ్చి పెళ్లి చేసాడు బ్రాహ్మణుడు. కూతురూ, అల్లుడూ ఇంట్లోనే వుంటున్నారు.

ఇద్దరు ఆడపిల్లలు కలిగారు. సాటి వారు అత్తవారింటికి వెళ్ళడం చూచి, తండ్రి వద్దకు వెళ్లి "నాన్న నాకు అత్తవారింటికి వెళ్లాలని మనసుగా వుంది" అంది ఆ అమ్మాయి.

తండ్రి అల్లుణ్ణి పిలిచి "ఏమోయ్‌ మా అమ్మాయికి అత్త వారింటికి వెళ్ళాలని మనసుగా వుందట తీసుకొని వెళ్ళవలసింది" అని అల్లుడికి కొంత డబ్బు ఇచ్చాడు.

 అతడు ఆ డబ్బుతో ఊరికి దూరంగాను, .......పల్లెకు చేరువగానూ ఓ ఇల్లు వేసి భార్య, పిల్లలతో అందులో కాపురం పెట్టాడు.

రోజులు గడుస్తున్నాయి.
ఒక రోజు భర్త అరుగు మీద కూర్చొని వుండగా ఒకడు ఆ దారిన పోతూ "ఓరి బావా... ఓరి ఎళ్లా యిలారా" అని పిలిచాడు.

ఇంట్లో పనిచేసుకుంటున్న బ్రాహ్మణి ఇది విని "అదేమిటండీ? వాడు మిమ్మల్ని ఇలా పిలుస్తున్నాడు" అని అడిగింది.

"ఏం లేదు. ఏదో పూర్వ స్నేహంలే" అన్నాడు భర్త.
ఇదేమిటో చూద్దాం అని అతడి వెనుకనే బయలుదేరింది. ఆమె భర్త వానితో అతడి గూడేనికి వెళ్లి, వాళ్ల కంచాల్లో తిని, వాళ్ల ముంతల్లో త్రాగి వాళ్ల మంచాలపై దొర్లి, వాళ్ల గ్రామ్య భాషలో మాట్లాడటం చూసింది ఆమె. జరిగిన మోసం అర్థం అయిపోయింది.

గబ గబా తండ్రి వద్దకు వెళ్లి "నాన్న కుక్క ముట్టుకున్న కుండకు ప్రాయశ్చితం ఏమిటి ?" అని అడిగింది.
జరిగినదేమీ తెలియని అతడు వంటపాత్ర ఏదో కుక్క తాకి అపవిత్రం అయ్యిందని తలచి, "ప్రాయశ్చితం ఏముందమ్మా అగ్ని ప్రాయశ్చిత్తమే ప్రాయశ్చితం" అన్నాడు.

బ్రాహ్మణి తిన్నగా ఇంటికి వెళ్లింది. ఏమి మాట్లాడకుండా వంట చేసి భర్తకూ, పిల్లలకూ పెట్టి తాను మాత్రం అభోజనంగా పడుకుంది.

ఓ రాత్రి వేళ లేచి నిప్పు ముట్టించి తిరిగి పడుకొంది. తెల్లవారేసరికి నలుగురూ ఆ యింటితో పాటు కాలి మసయి వున్నారు.

నాలుగు జీవాలు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లాయి.
బ్రహ్మదేవుడు మీకేం ముక్తి? నీ భర్త పోతురాజు గ్రామ దేవత గుడి ముందు రాయిగా వుండి గ్రామదేవతతో పాటు పూజలందుకుంటాడు.

నీ బిడ్డలిద్దరూ కొత్తెమ్మ, కొర్రెమ్మ పురిటి నీళ్ల నాడు పెట్టే షడ్రసోపేతమైన నైవేద్యం వీళ్లకు ఆహారం.

నువ్వు ఎన్నెమ్మ పురుగై తిరుగుతూ నిన్ను ఎవరైతే తలవరో వారి పురిటి శిశువుల్ని తింటూవుండు అదే నీకు ఆహారం అన్నాడు ఎన్నెమ్మతో.

పాలేరు చేసింది వంచనే అయినా కల్లా కపటం లేదు. వాడు చేసిన పనిలోని ప్రమాదం అతడికి తెలియదు. పిల్లలు ఏ పాపం ఎరుగని అమాయకులు ఎటొచ్చీ బ్రాహ్మణి తండ్రి అహంకారం, భర్త వంచనకు ప్రతీకారం చేయబోయి ఆమె శాశ్వతంగా పురుగుగా రూపొందింది.

ఏలా కోటెమ్మ
మా బాలల్ని గాయీ
ఒకటోనాడు ఎన్నెమ్మ
ఓరుస్తుందే ఎన్నెమ్మ
రెండో నాడూ ఎన్నెమ్మ
రెక్కలు కట్టుకు ఎన్నెమ్మ
మూడోనాడు ఎన్నెమ్మ
మువ్వలు కట్టుకు ఎన్నెమ్మ
నాలుగో నాడూ ఎన్నెమ్మ
నాట్యంచేసీ ఎన్నెమ్మ
ఐదో నాడూ ఎన్నెమ్మ
ఆడుతు పాడుతు ఎన్నెమ్మ
ఆరో నాడూ ఎన్నెమ్మ
అరుస్తూను ఎన్నెమ్మ
ఏడో నాడూ ఎన్నెమ్మ
ఏడుస్తూనూ ఎన్నెమ్మ
ఎనిమిదో నాడు ఎన్నెమ్మ
ఏరుదాటే ఎన్నెమ్మ
తొమ్మిదో నాడూ ఎన్నెమ్మ
తోరణందూరే ఎన్నెమ్మ
పదవనాడూ ఎన్నెమ్మ
పట్నందాటే ఎన్నెమ్మ

అని పాడుతూ మల మూత్ర విసర్జన వేళ ఇన్ఫెక్షన్‌ సోకే అవకాశం వుందని 3,4,5,6 రోజులు మాతా, శిశువుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడాలని, ఏడవ రోజున ఎన్నెమ్మ తన ప్రయత్నాలు సాగలేదని ఏడుస్తూ వుంటుందనీ, ఏడు రోజులు దాటితే కొంత ఆపద తొలుగుతుందని, పదో రోజున ఎన్నెమ్మ పట్నం దాటి అంతా శుభమని ఈ పాటలో అన్యాపదేశంగా చెప్తారు.

అమ్మా ధన్యాస్మి ....దీని తరువాత  అనుకుంటా పురుటి మంచం  కోళ్ళకు
 కూడా  పసుపు,కుంకుమ రాసి  పూజ చేసి నైవేద్యం ఇస్తారు, తరువాత సూర్యుడికి  అర్ఘ్యమూ  ,నైవేద్యమూ  (పెరుగన్నం ) పెడతారు ....

మేం ఇప్పుడు కూడా  ఈ కథ చెబుతూనే  పురిటి స్నానం పోస్తాం తరువాత చాకలమ్మాయి బట్టలన్ని పట్టుకుని వెనక్కుతిరిగి చూడకుండా వెళ్ళి పోతుంది సాయంత్రం  చాకలమ్మాయి మళ్ళీ వస్తుంది  అప్పుడు  తల్లి పిల్లను నల్లటి రగ్గుతో కప్పి, నాలుగు దిక్కుల్లో నాలుగురకాల అన్నంలో దీపాలు పెడతారు పసుపు కుంకుమ పెరుగు. తెలుపురంగులు తరువాత గలకరాళ్ళు డబ్బాలో పోసి చేతితో తడుతూ  తానుగెంతుతూ ఈ పాట పాడి దిష్టి తీసి వెళ్ళి పోయాక అక్కడంతా  శుభ్రం చేసి  పురిటి  మంచం కోళ్ళకు  పూజ చేస్తారు అత్తవారింటికి వెళ్ళాక కూడా మళ్ళీ  వచ్చి ఒక రోజు  పురిటి మంచం చూసి  పడుకుని వెళ్ళాలంటారు.

నా పురిటి అప్పుడు మా మామ్మ చెప్పింది ఈ కథ! అప్పుడు చాలా భయం వేసింది కూడా! పురిటి పసికందుని ఒంటరిగా వదిలి వెళ్లవద్దని చెప్పింది. ఎప్పుడూ పురిటి గదిలో దీపం ఉంచాలని కూడా చెప్పింది. చీకట్లో పదుకోకూడదుట తల్లీ పసిపిల్లా! ఇప్పటివారికి ఇవి విడ్డూరాలు మరి!!



 చాలాకాలం క్రితం ఎక్కడ నుంచో  ఈ కథ copy చేసాను. వారికి 🙏🏻 

Saturday, April 19, 2025

నాతి చరామి


అది నిజానికి ' న అతి చరామి ' అంటే ' నిన్ను దాటి వెళ్ళను ' అని భర్త భార్య తో చెబుతాడు.. వివాహం చేసుకుంటున్నప్పుడు.

ధర్మేచ, ఆర్థేచ, కామేచ…న అతి చరామి అన్నది పూర్తి పాఠం.

"ధర్మం పాటించడంలోనూ, సంపాదించడంలోనూ, ధర్మసమ్మతమైన జీవితం గడపటంలోనూ నిన్ను దాటి వెళ్ళను "

అంటే.. నా ఒక్కడి కోసమే చేయను. నేను చేసే అన్ని ధర్మ బద్ధమైన కార్యాలూ నీ భాగ స్వామ్యం తోనే చేస్తాను. నీవు లేకుండా చేయను అని అర్థం.

భార్య లేనివాడు ఏ రకమైన కామ్య కారక యజ్ఞాలు చేయరాదు. భార్యకు అంత ప్రాముఖ్యత అని వేదం నిర్దేశం చేసింది.

బ్రాహ్మచారికి శంకుస్థాపన చేసే అధికారం కూడా లేదు.

షరా : అక్కడక్కడా ధర్మేచ అర్ధేచ, కామేచ, మోక్షేచ అన్నది కూడా వినపడుతుంది. కానీ ఇది తప్పు. ' మోక్షేచ  అన్నది లేదు.

మోక్షం విషయం లో ఎవరి అర్హత వారిదే. 

"అర్ధేచ, నీతో సంప్రదించి, ఆలోచన చేసి, తెలియ చేసిన తరువాతనే, డబ్బు, ఆస్తుల  విషయాలలో నిర్ణయం తీసుకుంటాను"

"కామేచ, కామం అంటే ఒక్క శారీరక వాంఛ మాత్రమే కాదు. మనసులోన వచ్చే ఏ ప్రాపంచిక. కోరిక అయినా నీకు చప్పి, నీ సహచర్యంలో , నీతో, నీ ద్వారా మాత్రమే అనుభవిస్తాను."

బ్రాహ్మణుడు జీవితంలో రెండుసార్లు నాతి చరామి అంటాడు. 

మెదటి సారి ఉపనయనం సమయంలో తండ్రికి మాట ఇస్తాడు. 

"నేను మీరు ఉపదేశించిన గాయత్రి మంత్రం, ఈ ప్రక్రియ ద్వారా పొందిన విధివిధానం, భ్రహ్మచర్యం పాటిస్తూ. మీ ఆఙ్ఞానుసారం  అవలంభిస్తాను." అని.

రెండవసారి పెళ్ళిలో సహధర్మచారిణికి వాగ్దానం చేస్తూ.

Thursday, April 17, 2025

రుద్రం ...నమకం... చమకం

రుద్రం ...నమకం... చమకం
...................
నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః
నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యా ము తతేనమః..

నమో భవాయ చ రుద్రాయ చ.
నమశ్శర్వాయ చ పశుపతయే చ.

 పరమేశ్వరుడి ని సేవించుకుని ఆయనకి అర్చన చేయడం లో  హెచ్చు స్వరం లో పఠించే శ్రీ రుద్రం   ....నమకం, చమకం అని రెండు భాగాలుగా ఉంటుంది. యజుర్వేదం 16వ అధ్యాయాన్ని నమకం అంటారు. మంత్రం చివర  నమః అనేపదం ఉంటుంది కాబట్టి   నమకం అని అన్నారు.  యజుర్వేదం 18వ అధ్యాయాన్ని చమకం అంటారు. ఇక్కడ మంత్రం చివర "చ" అనే పదం ఉంటుంది కాబట్టి చమకం అని అన్నారు..
రుద్రం, మహారుద్రం, లఘురుద్రం, అతి రుద్రంలో తేడాలు ఉన్నాయి. యజుర్వేదంలోని మంత్రభాగమైన 11 అనువాకాల 'శతరుద్రీయా'నికి 'రుద్రం' అని పేరు. ఒకసారి పఠిస్తూ చేసే అభిషేకం రద్రాభిషేకం అంటారు. దానికి 'రుద్రం', 'ఏకరుద్రం' అని పేర్లు కూడా ఉన్నాయి. ఈ 11 అనువాకాల 'రుద్రం' పదకొండుసార్లు చెబుతూ చేస్తే 'ఏకాదశ రుద్రాభిషేకం' లేదా 'రుద్రి' అంటారు. రుద్రాన్ని 121 సార్లు పఠిస్తూ చేసే అభిషేకం 'లఘురుద్రాభిషేకం'. 11 లఘురుద్రాలు ఒక 'మహారుద్రం' అంటే, ఈ అభిషేకంలో రుద్రం (మొత్తం 116 అనువాకాలు) 1331 సార్లు పఠించబడుతుంది. ఈ మహారుద్రాలు పదకొండయితే 'అతిరుద్రం', దీనిలో 14641 సార్లు  రుద్రం చెప్పబడుతుంది. ఈ రుద్రమంత్రాలను అభిషేకానికి వాడితే 'రుద్రాభిషేకం' హోమంలో వినియోగిస్తే 'రుద్రయాగం'.

From FB - Vydehi Murthy

Vidurudu - Mahabharatam

మహాభారతం ఒక ఇతిహాసం. ఇందులో ముఖ్య ఘట్టం కురుక్షేత్ర సంగ్రామం. ధర్మ యుద్ధం.   ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొన్న మహాయోధులు, పాత్రలు కారణ జన్ములు. కృష్ణుడు సాక్షాత్తు పరమాత్మ  అయితే, కొందరు అయోనిజలు, ఇంకొందరు దైవాంశసంభూతులు, మరికొందరు ఆ యుద్ధ కోసం మటుకే పుట్టిన వారు. వారందరూ ఆ సమయంలో కురుక్షేత్రంలోకి అడుగు పెట్టడానికి, ద్వాఫర యుగ అధర్మ వినాశనానికీ జగన్మాత కదిపిన పావులు, సృష్టించిన  సంఘటనలు మనిషి ఊహకు అందనివి. శంతనుడు గంగను కలవటం, అష్ట వసువుల శాపం, మత్స్యగంధి జననం, పరాశర మహర్షి మత్స్యగంధి ద్వారా  వేదవ్యాసుని జననం, అంబ శపధం, రాజభోగాలు అనుభవించే గాంధారి మనసులో అసూయ, ద్రౌపది  ఆవిర్భావం . . .   ఇలా కాల చక్రంలో సంభవించిన అనేక సంఘటనలు,  జీవితాలు, చివరకు 
కురుక్షేత్రం చేరటం, అంతా జగన్మాత సంకల్పం. కొన్ని పుటుకలు  అసంభవంగా అనిపిస్తాయి, కొన్ని  సంఘటనలు ఆశ్చర్యంగా ఉంటాయి. అన్నిటి ప్రయాణం ధర్మ సంస్ధాపన వైపే.  ధర్మ సంస్ధాపన కోసమే. ధర్మ సంస్ధాపనే లక్ష్యం. 

×  ×  ×  ×  ×  ×  ×  ×  ×  × 

Mahabharata is an epic.

The main event in this is the Kurukshetra War. War to establish Dharma. Those who directly or indirectly caused the war, the great warriors who participated, and the characters are causal births. While Krishna is the real Supreme Soul, some are immortals, some are divine beings, and some are born only for that war. All of them were the steps that Jaganmata moved and created to set foot in Kurukshetra at that time, and to destroy the unrighteousness of Dwapara Yuga.

The events that were created by Jaganmata are beyond human imagination. Shantanu meeting Ganga, the curse of the eight Vasus, the birth of Matsyagandhi, the birth of Vedavyas through Parashara Maharshi and Matsyagandhi, the oath of Amba, the jealousy in the mind of Gandhari who was enjoying royal pleasures, the emergence of Draupadi . etc . . Thus, the many events and lives that have occurred in the cycle of time, and finally reaching Kurukshetra, are all the will of Jaganmata. Some events seem impossible, some events are surprising. All of this journey and goal is towards the establishment of Dharma. It is for the establishment of Dharma.


x  x  x  x  x  x  x  x  x  x  x  x  x  x  x  x  x  x  x  x  x  x 



Vidurudu, a virtuous character in MahaBharata. One of the few who never entered Kurukshetra, battle ground of Pandavas and Kauravas. 

Once upon a time, Shantanu, great king of Kuru dynasty, married Godess Ganga. With her, he had a son, Devavratudu. Many years after Ganga left him, Shantanu  falls in love with Satyavati. For their marriage, Devavratudu promises Satyavati's father, never to be married, have sons and  sit on throne. 

Shantanu and Satyavati procured two children, Chitrangadudu and Vichitraveeryudu. Shantanu dies when the boys are very young. After a few years Chitrangadudu marries Ambika and Ambalika, pincesses of Kasi Kingdom. Both Chitrangadudu and Vichitraveeryudu dies childless. 

Satyavati, before marrying  Santanu, gives birth to Sage Veda Vyasa through Sage Parasara. As the Kuru dynasty falls into troubles without a king on throne, Satyavati calls VedaVyasa, who by Devaranyayam Dharma, is eligible to impregnate Ambika and Ambalika. At that time VedaVyasa in penance with severe rules. By appearance he was scary with long hair, red eyes and stern face.

IN first attempt Ambika closes her eyes looking at him. Dhrutarashtra, father of Kauravas was born blind. Second, attempt with Ambalika, resulted in Pandu, as she felt fear by looking at Vyasa. When Ambika was requested to go to Vyasa again, she sent her maid servant who gave birth to Vidurudu. 

Once upon a time,  Sage Mandavyudu, after roaming the world,  visiting punya teerthalu and punyakshrtralu, comes to a kingdom. There he vows silence and starts penance. During that time, few thieves enter palace and escape to jungle with bags filled with jewels.

They approached and hid nearby trees to the place where Saga Mandavyudu is performing penance. King's soldiers caught them and also the sage. As the sage was under vow, he didnt say a word. When all of them were presented to the king, he ordered all of them to be "shoolaarohana". ( it means to be seated on a spear).

Over a few days, the spear entered Sage Mandavya's  body and protruded out at neck. Still he was alive. Other sages came to know of this and approached him questioning. He said, " I am not this body. This body cannot express any of the feelings. So what is there to complain? Moreover this must be past life's karma. " Soldiers who at vigilance nearby, heard this and rushed to the king and informed about the sage on the spear. King ran to the place and ordered the sage to be removed from spear. But the task was impossible as the spear was inside the body. So the soldiers cut off the spear head and left the remaining part in sage's body. 

The sage then wanted to know in which birth, what time, what instance created the karma which resulted this situation in this life. He went to Yama loka where Chitraguptudu keeps record of all souls in eternity.  There Yama told him that, '"IN one of your previous lives, as a boy, you used to catch hold of dragonflies, pierce them with needles n enjoy their plight". 

The sage then asked, "How old was I?" 

Yama replied, "about nine or ten years."

Then Mandavyudu questioned Yam,  " till the age of 14, for instance of justice and  judgement, considered juvenile and age of ignorance. Any act during that age cannot be considered criminal. As Lord of Dharmam, how can you give such severe punishment to me? You have done injustice. You have done adharmam.". Then the sage cursed Yamadharmaraj, "You too have to bear the consequences of your doing. So, Yamadharmaraja, you shall be born in human world, even though you are born extremely intelligent, knowing all shastras, well educated, extremely virtuous, clearly understands Dharmam, able to assess future actions of humans, you shall remain completely ineffective in your actions. Feel worthless. Though capable to rule a kingdom, shall remain as a servant." 

In Dwaparayuga, Yamadharmaraju was born as Vidura.

Vidura repeatedly cautioned Dhritarastra and Duryodhana about the consequences of their actions. He kept vigilant on Padavas.

He repeatedly preached Darmam to all.

However, nobody listened to him as he was only a minister and servant to the king. 

At the end of his life, his atma leaves body and merges into Dharmaraju. 

Sunday, April 13, 2025

Black Hole

మహాభారతం ఒక ఇతిహాసం. ఇందులో ముఖ్య ఘట్టం కురుక్షేత్ర సంగ్రామం. ధర్మ యుద్ధం.   ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొన్న మహాయోధులు, పాత్రలు కారణ జన్ములు. కృష్ణుడు సాక్షాత్తు పరమాత్మ  అయితే, కొందరు అయోనిజలు, ఇంకొందరు దైవాంశసంభూతులు, మరికొందరు ఆ యుద్జధం కోసం మటుకే పుట్టిన వారు. వారందరూ ఆ సమయంలో కురుక్షేత్రంలోకి అడుగు పెట్టడానికి, ద్వాఫర యుగ అధర్మ వినాశనానికీ జగన్మాత కదిపిన పావులు, సృష్టించిన  సంఘటనలు మనిషి ఊహకు అందనివి. శంతనుడు గంగను కలవటం, అష్ట వసువుల శాపం, మత్స్యగంధి జననం, పరాశర మహర్షి మత్స్యగంధి ద్వారా  వేదవ్యాసుని జననం, అంబ శపధం, రాజభోగాలు అనుభవించే గాంధారి మనసులో అసూయ, ద్రౌపది  ఆవిర్భావం . . .   ఇలా కాల చక్రంలో సంభవించిన అనేక సంఘటనలు,  జీవితాలు, చివరకు 
కురుక్షేత్రం చేరటం, అంతా జగన్మాత సంకల్పం. కొన్ని పుటుకలు  అసంభవంగా అనిపిస్తాయి, కొన్ని  సంఘటనలు ఆశ్చర్యంగా ఉంటాయి. అన్నిటి ప్రయాణం ధర్మ సంస్ధాపన వైపే.  ధర్మ సంస్ధాపన కోసమే. ధర్మ సంస్ధాపనే లక్ష్యం. 

black hole is a massive, compact astronomical object so dense that its gravity prevents anything from escaping, even light. Albert Einstein's theory of general relativity predicts that a sufficiently compact mass will form a black hole. The boundary of no escape is called the event horizon

Few crore years ago, In Hindu epic Mahabharata, set in Dwapara Yuga, Sage Veda Vyasa mentioned what is beyond Black hole. 

When Krishna and Balarama were ruling Dwaraka, a Brahmin lived in Dwaraka. He was pious and followed dharmic life style. He was overjoyed when his wife got pregnant.  He was looking forward to hold the baby in his hands n play with him. 

The day came. His wife delivered a still born boy. He was shocked. Questioned, and assessed his Karma. Then concluded that its the King who is responsible for such non dharmic incident in his life. The karma, result of the right or wrong doings,  of the King, who is the father figure to all of the land he rules n its inhabitants, influences the fate of the over all kingdom. So, the brahmin took the dead body to the palace, placed in front of the gate n cried his heart out. Demanded justice. Krishna, almighty, though in the palace, was silent. The same repeated eight more times.

Arjuna was visiting Dwaraka and in the palace when the Brahmin brought dead body of his ninth child. He couldn't ignore the Brahmin's accusations.and blaming the King. He looked at Krishna who was quietly listening and walked out of the palace. Arjuna approached the brahmin. Then arrogantly assured him that he will stop death and protect the brahmin's next child with all his power. He felt arrogantly and great as he holds mighty Gandiwanam, divine bow, and pasupataastram, Lord Siva's arrow. He felt  Krishna might be having his reasons, however as kshatriya, he is capable of stopping death at any point. Arjuna told the brahmin to inform him next time when brahmin's wife goes into labour. He will stop the death from taking brahmin's child. Arjuna also arrogantly vowed that if he fails in doing so, he will end his life by entering fire.

After several months, the brahmin came to Krishna's palace and informed Arjuna that his wife is in labour. Immediately Arjuna went to brahmin's house. He carefully, with concentration, putting all his might and power bestowed upon him, with his divine bow and arrows made a fine unpenetratable cage around the house. His arrows were so powerful that not even an ant can pass through without being caught. He waited outside.

After sometime the brahmin approached Arjuna. This time the new born baby's body also disappeared! Arjuna was shocked. He then went to Yamaloka and questioned Yama, Lord of Death about the brahmin's child. Yama said that he is not aware of the child's whereabouts.  He then went to swarga n asked  Lord Indra to return the child. Indra also denied that he has the child. Then Arjuna went to all ashta dikpalakas, nava grahas and all lokas in search of brahmin's child. He failed to find the child.

Upon returning to Dwaraka, failing to find the brahmin's boy, as vowed, Arjuna prepared to enter fire and end his life. At that time Krishna came to him on his chariot and said, "come with me. I will show you where the brahmin's boyes are". He took Arjuna onto his chariot and flew into sky. 

Together Krishna and Arjuna flew out of earth, crossed solar system, then stars, then galaxy and then brahmandamulu. Then they reached a dark place. It's dark everywhere.  Nothing exist there. Nothing visible. Krishna's chariot horses stalled in their tracks. Arjuna, mighty warrior, fought and won Kurukshetra, yuga's biggest war, killed many demons during his jaitra yatra, who never experienced fear in his life felt terror looking at the darkness. He expressed the same to Krishna.
Krishna called his Sudarshana chakra and ordered to show path with its light. As Sudarshana moved in front of the Krishna's chariot,  showing path, the horses started moving forward. 

After sometime,  In distance Arjuna saw light. Slowly as they approached the light, he saw Lord Vishnu lying on Adisheshu/Ananta. Godess Lakshmi was at His feet. Few sages were standing beside Him. The brightness of thousand suns was from Ananta and the cool bright light of crores of galaxies and suns was from Vishnu himself. Arjuna then saw ten boys playing at Vishnu's feet.

Looking at Krishna and Arjuna, Lord Vishnu smiled. He turned to the sages and said, "you wished to see NaraNarayanulu. Here they are. My own incarnation".  He then turned to Arjuna and said, "I had to bring brahmin's children to bring you two here. To my abode. To witness the beginning and end of all life and matter. Apart from me, no one is responsible of either life or death. Even mighty Pasupataastram is of me. Everything you witness is created by me. Take the brahmin boys back to their father".

Arjuna, mesmerised and dumbstruck,  looked at Lord Vishnu, stood aside with folded hands. After receiving blessings from the sages, Krishna and Arjuna returned to earth  Dwaraka and Krishna's palace.  

Arjuna returned to Hastinapuram with enlightened soul and understanding of universe and creation. His arrogance disappeared. 

Saturday, April 5, 2025

Satyanaarayana Pooja - Mandapam

During Satyanaarayana vratam, the priest informs us the location of different grahaas, dikpaalakaas and lokapaalakas. Sometimes it is very confusing if one is not familiar with dikkulu, dikpaalakulu n directions.

I have created this for easy reference and understanding. Hope it helps.  

సత్యనారాయణ వ్రతం సమయంలో పూజారి చెప్పిన విధంగా గ్రహ, దిక్పాలక, లోకపాలక స్థానాల్లో మనం పూజ చేయటం జరుగుతూ వుంటుంది. తరచూ పూజా విధానo అలవాటు లేకపోతే ఈ స్థానాలు కాని, పధ్ధతి కాని చికాకుగా అనిపించవచ్చు.

ఇక్కడ నేను మండపo కూర్చుకునే పధ్ధతి, గ్రహ, దిక్పాలక, లోకపాలక స్థానాలని చూపించే ప్రయత్నం చేసాను. మీకు ఉపయోగ పడుతుందని భావిస్తాను.





కృష్ణాష్టకం


కృష్ణాష్టకం

వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్ ।
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ ॥

అతసీ పుష్ప సంకాశం హార నూపుర శోభితమ్ ।
రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుమ్ ॥

కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననమ్ ।
విలసత్ కుండలధరం కృష్ణం వందే జగద్గురమ్ ॥

మందార గంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజమ్ ।
బర్హి పింఛావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుమ్ ॥

ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీల జీమూత సన్నిభమ్ ।
యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుమ్ ॥

రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితమ్ ।
అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుమ్ ॥

గోపికానాం కుచద్వంద కుంకుమాంకిత వక్షసమ్ ।
శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుమ్ ॥

శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితమ్ ।
శంఖచక్ర ధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్ ॥

కృష్ణాష్టక మిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ ।
కోటిజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ॥