దుర్గానవరాత్రి ఆరవ
రోజు
ఆయనం: దక్షిణ
ఋతువు: శరత్
మాసం: ఆశ్వీజ
పక్షం: క్రిష్ణ
తిధి: షష్టి
దుర్గ – కాత్యాయని
రంగు – చిలకాకుపచ్చ
నైవేద్యం – కేసరీబాత్
ధ్యానం
చంద్రహాసోజ్వలా
కరశార్దూల వర వాహనా
కాత్యాయనీ శుభం దద్ద్యా దేవీ దానవఘాతినీ
గమనిక - నేను post చేస్తున్న
అమ్మవారి నవరాత్రి అవతారాలు, రంగు, నైవేద్యం,
ధ్యానం మొదలైనవి శ్రీశైలం శంకరమఠంలో కలిసిన ఒకావిడ వివరించింది. కంచి, శృంగేరి,
దక్షిణ, ఉత్తర, తూర్పు, పడమర, ఇలా వివిధ సాంప్రదాయాలు, అలాగే రాజరాజేశ్వరి, లలితాపరమేశ్వరి, బాలాత్రిపురసుందరి, ఇలా జగన్మాతకి
చాలా పేర్లు. ఎదిఏమైనా, మనస్పూర్తిగా ఆ జగదంబని ఏ పేరు పెట్టి పిలిచినా
పలుకుతుంది. ప్రాంతాలవారిగా మనిషి పిలుపు మార్చినా ఆ తల్లి కరుణా దృష్టి
భక్తులందరి మీదా ఎల్లప్పుడూ వుంటుంది.
