దుర్గానవరాత్రి నాలుగవ రోజు
ఆయనం: దక్షిణ
ఋతువు: శరత్
మాసం: ఆశ్వీజ
పక్షం: క్రిష్ణ
తిధి: చవితి
దుర్గ – కూష్మాండ దుర్గ
రంగు – నేరేడు
నైవేద్యం – చిల్లు లేకుండా అల్లపు గారే
ధ్యానం
సురా సంపూర్ణ కలశం
రుధిరాప్లుత మేవచ
దధానా హస్త పద్మాభ్యాం కూష్మాండ శుభాదాస్తుమే
గమనిక - నేను post చేస్తున్న
అమ్మవారి నవరాత్రి అవతారాలు, రంగు, నైవేద్యం,
ధ్యానం మొదలైనవి శ్రీశైలం శంకరమఠంలో కలిసిన ఒకావిడ వివరించింది. కంచి, శృంగేరి,
దక్షిణ, ఉత్తర, తూర్పు, పడమర, ఇలా వివిధ సాంప్రదాయాలు, అలాగే రాజరాజేశ్వరి, లలితాపరమేశ్వరి, బాలాత్రిపురసుందరి, ఇలా జగన్మాతకి
చాలా పేర్లు. ఎదిఏమైనా, మనస్పూర్తిగా ఆ జగదంబని ఏ పేరు పెట్టి పిలిచినా
పలుకుతుంది. ప్రాంతాలవారిగా మనిషి పిలుపు మార్చినా ఆ తల్లి కరుణా దృష్టి
భక్తులందరి మీదా ఎల్లప్పుడూ వుంటుంది.
