Saturday, September 7, 2013

దుర్గానవరాత్రి మొదటి రోజు - Navaratri


 
 
 

దుర్గానవరాత్రి మొదటి రోజు / నవరాత్రి వ్రతం ప్రారంభం

ఆయనం: దక్షిణ  

ఋతువు: శరత్

మాసం: ఆశ్వీజ

పక్షం: క్రిష్ణ

తిధి: పాడ్యమి

దుర్గ   శైలపుత్రి

రంగు   ఆకుపచ్చ

నైవేద్యం కట్టెపొంగల్

ధ్యానం

వందే వాంఛిత లాభాయ చంద్రార్ధ కృత శేఖరాం

వృశారుఢాం శూల ధరాo శైలపుత్రీం యశస్వినీం


గమనిక - నేను post చేస్తున్న అమ్మవారి నవరాత్రి అవతారాలు, రంగు, నైవేద్యం, ధ్యానం మొదలైనవి శ్రీశైలం శంకరమఠంలో కలిసిన ఒకావిడ వివరించింది. కంచి, శృంగేరి, దక్షిణ, ఉత్తర, తూర్పు, పడమర, ఇలా వివిధ సాంప్రదాయాలు, అలాగే రాజరాజేశ్వరి, లలితాపరమేశ్వరి, బాలాత్రిపురసుందరి, ఇలా జగన్మాతకి చాలా పేర్లు. ఎదిఏమైనా, మనస్పూర్తిగా ఆ జగదంబని ఏ పేరు పెట్టి పిలిచినా పలుకుతుంది. ప్రాంతాలవారిగా మనిషి పిలుపు మార్చినా ఆ తల్లి కరుణా దృష్టి భక్తులందరి మీదా ఎల్లప్పుడూ వుంటుంది.